ప్లానింగ్‌ మొత్తం మార్చేసిన కొరటాల!

Sunday, December 22, 2024

యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా వారం దాటినా కలెక్షన్ల పరంగా సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
సినిమా విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్ల పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వచ్చారు.

ఫలితంగా ఈ సినిమా రూ. వారానికి 405 కోట్లు సంపాదించుకుంటుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఈ దసరా సెలవుల్లో వచ్చేవన్నీ లాభమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 ని కూడా ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇక పార్ట్ 1 కాస్త నిరాశ పరచడంతో పార్ట్ 2 కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సినీ వర్గాల్లో దేవర పార్ట్ 2 కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.దీంతో దేవర పార్ట్ 2 లో కొరటాల ఇప్పుడు పార్ట్ 1 లో చూపించిన నేపథ్యానికి పూర్తిగా భిన్నమైన బ్యాక్ డ్రాప్ ని ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోతాయని ప్రచారం జరుగుతుంది.

ఇక దీంతో పాటుగా పార్ట్ 2 రావడానికి 2027 చివరలో లేదా 2028 వరకు ఆగాల్సిందే అన్నట్టు వినిపిస్తోంది. మరి మొత్తానికి అయితే పార్ట్ 2 పట్ల మరిన్ని స్పెషల్ ప్లానింగ్ లు ఉన్నట్లే ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles