ముద్దుగా ఉన్న క్లీంకార!

Andhrawatch
1 Min Read

మెగా ప్రిన్సెస్ క్లీంకార తాత, ముత్తాతలతో కలిసి ఆలయాన్ని సందర్శించింది. అపోలో హాస్పిటల్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో  జరిగిన వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటోను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఉపాసన ఈ ఫొటోను షేర్ చేస్తూ.. క్లీంకార తాత చేతుల్లో చూస్తుంటే నా బాల్యం గుర్తుకు వస్తుంది అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు చిన్ని క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది అంటూ హార్ట్ ఎమోజీస్ తో తమ సంతోష కామెంట్లు పెడుతున్నారు.  అయితే ఈ ఫొటోలో కూడా ఉపాసన ఫేస్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని బ్లర్ చేశారు.

Share This Article