కిస్సిక్‌ అంటున్న…!

Thursday, December 26, 2024

క్రియేటివ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ స్పెషల్‌ సాంగ్‌.. శ్రీలీల డ్యాన్స్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ ‘కిస్సిక్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూసిన ఈ పాట లిరికల్‌ వీడియో ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లిరిక్స్ తో పాటు శ్రీలీల స్టెప్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి బన్నీ – శ్రీలీల కెమిస్ట్రీ కూడా చాలా బాగా సెట్‌ అయ్యింది. డిసెంబరు 5న సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది.

ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా చేస్తుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం అందించనున్నారు.

మొత్తానికి పుష్ప-2 చిత్రానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ఎలాంటి ట్రీట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles