టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న హారర్ జోనర్ చిత్రం ‘కిష్కింధపురి’ ఇటీవలే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే మంచి ఆసక్తి రేకెత్తించాయి.
తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని యూనిట్ తెలిపింది. అయితే ఒక్క కట్ కూడా లేకుండా సర్టిఫికెట్ రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
