మాస్‌ యాక్షన్‌ తో కె ర్యాంప్‌ ఆడించిన కిరణ్‌ అబ్బవరం!

Monday, December 8, 2025

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా ‘కె-ర్యాంప్’ ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రాన్ని జైన్స్ నాని అనే దర్శకుడు మాస్ అండ్ ఫుల్ కామెడీ టచ్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోతో సినిమా పట్ల హైప్ ఇంకాస్త పెరిగింది.

గ్లింప్స్ చూస్తుంటే కిరణ్ పూర్తి ఊర మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. వేషధారణ, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నింటిలోనూ ఆ జానర్‌కు తగ్గట్టే ఆయన ఓ చిల్లర గాడిగా కట్టిపడేస్తున్నాడు. సినిమాల్లో మన ఊరిలోనో పక్కా బస్టాండ్ దగ్గర ఉండే అల్లరి గాళ్లు ఎలా ఉంటారో ఆ టైప్ క్యారెక్టర్‌ను కిరణ్ పోషిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ పాత్రలో అతని డైలాగులు, స్టైల్, హావభావాలు అన్నీ కూడా కామెడీతో కలిపి పక్కా మాస్ ఫీల్ ఇచ్చేలా ఉన్నాయ్. ఈ సినిమాతో కిరణ్ తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడు. ఇక హీరోయిన్ యుక్తి తరేజా ఈ సినిమాతో తెలుగులో మరోసారి కనిపించబోతుండగా, సంగీతం  చైతన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నాడు.

సినిమా మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించేలా ఉండబోతోందని టీజర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 18న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ బట్టి చూస్తే, ఈ సినిమా కిరణ్ కెరీర్‌లో ఒక ఎంటర్‌టైనింగ్ మైలురాయిగా నిలవనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles