రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా యాక్షన్ డ్రామా కింగ్డమ్ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కొత్త లుక్‌తో విజయ్ ఈ సినిమాలో కనిపించగా, తన పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శ్రమించాడని తెలుస్తోంది. సినిమా నుంచి భారీ అంచనాలు ఉన్నప్పటికీ థియేటర్లలో మాత్రం సరాసరి రిజల్ట్ సాధించింది.
బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. జూలై 31న విడుదలైన కింగ్డమ్ చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుందని అధికారికంగా ప్రకటించారు.
