సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన సినిమా “కింగ్డమ్”. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన పొందలేకపోయింది. విడుదల సమయంలో ఊహించిన స్థాయిలో రాణించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది.
అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు స్ట్రీమింగ్ హక్కులు తీసుకోగా, తాజా అప్‌డేట్ ప్రకారం “కింగ్డమ్” అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే సౌకర్యంగా ఈ సినిమాను చూడొచ్చు.
