బుక్ మై షోలో ‘కింగ్డమ్’ మాస్ జాతర!

Monday, December 8, 2025

విజయ్ దేవరకొండ ప్రస్తుతం “కింగ్డమ్” అనే భారీ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. చాలా రోజుల తర్వాత విజయ్ ఒక కొత్త లుక్‌తో తెరపై కనిపించనున్న ఈ సినిమా పట్ల అభిమానుల్లో మంచి క్రేజ్ నెలకొంది.

ప్రేక్షకుల ఆసక్తిని బట్టీ ఇప్పటికే బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్నటి వరకు లక్ష టికెట్లు అమ్ముడవ్వగా, ఈరోజు ఒక్కరోజులోనే ఆ సంఖ్య రెండు లక్షల మార్క్ దాటిపోయింది. ఇది చూస్తే ఈ సినిమా ఎంతటి అంచనాలతో వస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ అందించగా, సత్యదేవ్ సహా పలువురు నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాణ బాధ్యతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్వహించారు. కథా పరంగా, టేకింగ్ పరంగా, విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles