రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం కింగ్డమ్ థియేటర్లలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారాంతంలోనే బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో మాత్రం మరోసారి హైలైట్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత ఈ సినిమాకు ఊహించని విధంగా మంచి స్పందన వస్తోంది. థియేటర్స్‌లో పెద్దగా రాణించకపోయినా, ఇంట్లో చూసే ప్రేక్షకులు మాత్రం సినిమాను పాజిటివ్‌గా ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా థియేటర్లలో ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం సరైన ప్రమోషన్ లేకపోవడమేనని చాలా మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు.
మరికొందరు మాత్రం సినిమా లోని కథ చెప్పే విధానం వేరేలా ఉండి, ట్రైలర్ లేదా ప్రమోషన్ లో చూపిన తీరు వేరేగా ఉందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఓటీటీలో సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంటోంది
