మరోసారి సిక్స్‌ ప్యాక్ లో కింగ్‌!

Friday, December 20, 2024

ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో వరుస పెళ్లి వేడుకలతో ఒక హ్యాపీ వైబ్స్ నడుస్తున్నాయి.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య,  నటి శోభిత ధూళిపాళ పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి  సినీ ప్రముఖులు మన టాలీవుడ్ నుంచి అలాగే తమిళ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా హాజరై యువ జంటకి ఆశీస్సులు అందించారు. కానీ ఈ తర్వాత మాత్రం కింగ్ నాగ్ నుంచి ఒక క్రేజీ ట్రీట్ అభిమానులకు రాబోతుంది.

నాగార్జున ఈ ఏజ్ లో కూడా మంచి ఫిట్నెస్ అండ్ హ్యాండ్సమ్ లుక్ ని ఎలా కొనసాగిస్తున్నారో అందరికి తెలిసిన విషయమే.లేటెస్ట్ గా యువ జంటని తీసుకొని నాగార్జున ఓ ఆలయ సందర్శనకు ఆశీస్సులు కోసం వెళ్లగా అక్కడ నాగార్జున ఇంట్రెస్టింగ్ గా తన షర్ట్ లెస్ విజువల్స్ తో అక్కినేని ఫ్యాన్స్ ని వావ్ అనిపించేలా చేశారు.

నాగార్జున అక్కడ సిక్స్ ప్యాక్ లుక్స్ లో కనిపించడం మరో విశేషం. అప్పుడెప్పుడో ఢమరుకం సినిమా కోసం  సీనియర్ హీరోస్ లో 6 ప్యాక్ లుక్ ప్రిపేర్ చేసి ఆశ్చర్యపరచడం ఒకెత్తు అయితే ఇపుడు ఈ ఏజ్ లో కూడా అదే లుక్స్ లో కనిపించడం మరో  ఎత్తు అని చెప్పాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles