కుబేర నుంచి అదిరిపోయిన కింగ్‌ లుక్‌!

Monday, September 16, 2024

మన టాలీవుడ్ ఆల్ టైం కింగ్‌ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన రీసెంట్ సినిమా “నా సామిరంగ”. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మరి ఈ సినిమా తర్వాత నాగ్ నుంచి మరిన్ని సినిమాలు రాబోతుండగా తాను కీలక పాత్ర చేస్తున్న “కుబేర” కూడా ఆ సినిమాల్లో ఒకటి. టాలెంటెడ్ యంగ్ హీరో ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సినిమానే ఈ కుబేర.

మరి ఇందులో నాగార్జున చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా ఇది వరకే తన ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి అప్పుడు సీరియస్ లుక్ లో దర్శనం ఇచ్చిన నాగ్ పై ఇప్పుడు బర్త్ డే కానుకగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేశారు. మరి ఇందులో నాగ్ మంచి రిఫ్రెషింగ్ గా కనిపిస్తున్నారు అని చెప్పుకొవచ్చు. ఎవరినో పలకరిస్తున్నట్టుగా నాగ్ ఇందులో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ లో ఈ పోస్టర్ ఇపుడు వైరల్ గా మారింది.

ఇక ఈ చిత్రంలో రష్మిక  హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ సినిమాస్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles