రామాయణం కోసం కేజీఎఫ్‌ హీరో సాహసం!

Wednesday, January 22, 2025

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి హిందీ దర్శకుడు నితీష్ తివారి ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నారు. హిందూ పురాణ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో  సినిమాపై ఆడియన్స్ లో భారీగా అంచనాలు పెరిగాయి.

కొద్ది రోజుల క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త  ప్రస్తుతం బయటికి వచ్చింది. ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ హీరో యష్ అప్పుడే తన పాత్ర కోసం కసరత్తులు మొదలు పెట్టేసాడట.  తాజా సమాచారం ప్రకారం రావణుడి పాత్ర కోసం యష్ ఏకంగా 15 కేజీల బరువు పెరగబోతున్నట్టు సమాచారం.

రామాయణంలో రావణుడికి భారీ పర్సనాలిటీ ఉంటుంది. అందుకోసం ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో తన పాత్ర కోసం బరువు పెరగడంతో పాటూ డిఫెరెంట్ మేకోవర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా రామాయణాన్ని నీతిష్ తివారి మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పార్ట్ – 2 లో రావణుడి పాత్ర ఎక్కువగా ఉండబోతోంది.

బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హీరో యష్ ఈ సినిమాలో నటిస్తుండటంతో పాటూ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీరాముడిగా రణ్‌ బీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles