కన్నడ సినీ పరిశ్రమలో దుర్దినం నెలకొంది. కేజీఎఫ్ సినిమాలో బాంబే డాన్ శెట్టి పాత్రతో గుర్తింపు పొందిన నటుడు దినేశ్ మంగళూరు ఇకలేరు. ఆయన చేసిన పాత్ర పెద్దది కాకపోయినా, ఆ రోల్ ద్వారా ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు.
దినేశ్ మంగళూరు నటుడిగా మాత్రమే కాకుండా ఆర్ట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. వీర మదకరి, చంద్రముఖి ప్రాణసఖి, రాక్షస వంటి సినిమాల్లో ఆయన ఆర్ట్ డైరెక్షన్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు విశేషమేనని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
