నేచురల్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన కేజీఎఫ్‌ బ్యూటీ!

Tuesday, January 21, 2025

హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి గురించి తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మోడల్‌ గా కెరీర్‌ ప్రారంభించి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన కథానాయికగా కేజీఎఫ్‌ సినిమాలో యాక్ట్‌ చేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది .దాని తరువాత అదే మూవీ సీక్వెల్ గ వచ్చిన “కేజీఫ్ 2” కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది..

దీంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత చియాన్ విక్రం తో కోబ్రా సినిమాలో నటించింది. ఐతే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ తరువాత అమ్మడికి పెద్దగా ఆఫర్లు ఏమి రాలేదు .అప్పట్లో KGF తర్వాత తెలుగు నుంచి వరుసగా ఆఫర్లు వచ్చినా అప్పుడు చేయనని చెప్పిన శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న “తెలుసు కదా” సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఐతే తాజాగా ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా యాక్ట్‌ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు నేచురల్ స్టార్ నాని చేస్తున్న హిట్ 3 లో ఛాన్స్ అందుకుందని సమాచారం. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ సినిమాలు విశ్వక్ సేన్, అడవి శేష్ లు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు హిట్ 3 ని నాని చేస్తున్నాడు. ఈ సినిమాలకు నాని నిర్మాత అని తెలిసిందే. హిట్ 3 లో శ్రీనిధి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ అందుకుందని సమాచారం. ఇది నిజం అయితే అమ్మడుకి తెలుగులో రాను రాను మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles