వైరల్‌ అవుతున్న కత్రినా బేబీ బంప్ ఫోటోస్‌!

Wednesday, January 22, 2025

బాలీవుడ్‌ స్టార్‌ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటు ఫ్యామిలీ లైఫ్‌ ని ఎంజాయ్‌ చేస్తుంది.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అన్న విషయం గురించి ఎక్కడా తెలియజేయలేదు. తాజాగా లండన్ లో భర్తతో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వీడియోలో కత్రినాను చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ ప్రచారం మొదలునపెట్టారు. కత్రినా- విక్కీ తమ మొదటి బిడ్డకు లండన్‌లో జన్మనివ్వబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ బ్యూటీ ప్రెగ్నెంట్‌ అనీ, లండన్‌లో డెలివరీ ప్లాన్‌ చేసుకున్నట్లు ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో కత్రినా, విక్కీ రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నారు..  కత్రినా ధరించిన కోటు వల్లో లేక ఏమో కానీ కడుపుతో ఉన్నట్లు కనిపిస్తుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles