వెంకటేష్ దాగుబాటి సరసన వచ్చిన మల్లీశ్వరి సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కత్రినా కైఫ్, ఆ తర్వాత బాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అక్కడ బిజీ స్టార్ గా కొనసాగుతున్న ఆమె, టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ జంట నుండి ఒక సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది.
కత్రినా, విక్కీ కౌశల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం. కత్రినా తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను పంచుకోవడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో విక్కీ కౌశల్ ఈ ఏడాదిలో ఛావా అనే సినిమాతో పెద్ద విజయాన్ని సాధించిన సంగతి గుర్తుంచుకోవాల్సిందే.
