బాలీవుడ్ స్టార్ నటి ముద్దుగుమ్మ కత్రినా గురించి గత కొంత కాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కత్రినా గర్బం దాల్చిందని అందుకే బయట కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదని రూమర్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా కత్రినా ఉన్న ఓ వీడియో వల్ల ఆమె ప్రెగ్నెంట్ అంతేకాకుండా ఆమె లండన్ లో ప్రసవం చేసుకుంటుందని కూడా కొందరు రాసుకొచ్చేశారు.
అయితే తాజాగా కత్రినా వాటికి అన్నింటికి చెక్ పెట్టింది. గత నెలలో కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి లండన్‌కు కు వెళ్లారు. విక్కీ తన 36వ పుట్టినరోజును మే 16న లండన్‌లో చేసుకున్నాడు. ఇందుకు సంబందించిన ఫొటో లను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. లండన్ పర్యటన ముగుంచుకున్న.. విక్కీ కత్రినా జంట శనివారం రాత్రి ముంబైకి చేరుకుంది.
ఎయిర్ పోర్టులో కత్రినా బ్లాక్ సూట్‌లో ఫొటోలకు పోజులిచ్చిచ్చారు. ఆమె గర్భం దాల్చలేదనే విషయం ఈ ఫొటోలు చూస్తే తెలిసిపోతుంది. తాజా ఫొటోలతో కత్రినా అన్ని రూమర్లకు చెక్ పెట్టారు. ఇచ్చారు.