కోలీవుడ్ హీరో కార్తీకి మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా సినిమా “వా వాథియర్”పై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మొదట ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో రిలీజ్‌ను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త రిలీజ్ తేదీగా డిసెంబర్ 5ను ప్రకటించారు. ఈ సమాచారం కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు.
ఇక తమిళంలో రాబోతున్న ఈ సినిమాకు మంచి బజ్ ఉన్నప్పటికీ, తెలుగు వెర్షన్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
