యశ్‌ టాక్సిక్‌ నుంచి కరీనా ఔట్‌!

Tuesday, January 21, 2025

బాలీవుడ్‌ స్టార్ నటి కరీనా కపూర్‌ ..తెలుగు చిత్ర సీమకు పరిచయం లేకపోయినప్పటికీ ఆమె తెలియని వారుండరు. పలు యాడ్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ లో ఆమె ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలున్నాయి. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది. ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.

 సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా  కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది.  త్వరలోనే ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా. ఓ స్టార్‌ హీరో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్‌ మూవీ. షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది.

 కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్నదని వార్తలు షికారు చేస్తున్నాయి. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్‌’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారని గతంలో వార్తలు వినిపించాయి…తాజాగా ఈ టాక్సిక్ మూవీలో యశ్ సోదరి పాత్రలో కనిపించబోతోందని భావించిన కరీనా కపూర్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపైనా టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. గతేడాది డిసెంబర్లో టైటిల్ లాంచ్ తప్ప ఇప్పటి వరకూ అప్డేట్స్ ఇవ్వలేదు.. కరీనా వేరే సినిమాలు ఉండటం తో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles