మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఆయన నటించే సినిమాలు తెలుగు మార్కెట్‌లో కూడా మంచి రేంజ్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన రెండు కీలక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఒకటి కాంత కాగా, మరొకటి DQ 41.
కాంత సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లింప్స్, టీజర్లు చూసినప్పుడే దుల్కర్ నటన మళ్లీ ప్రత్యేకంగా కనిపిస్తుందని క్లియర్ అయింది. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదలను వాయిదా వేస్తున్నట్లు సినిమా బృందం తెలిపింది. ప్రేక్షకులకు ఇంకా మంచి అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత అదనపు సమయం తీసుకుంటున్నామని వారు ప్రకటించారు.
