హిందీలో సాలిడ్‌ వసూళ్లతో దూసుకుపోతున్న కాంతారా!

Monday, December 8, 2025

కన్నడ ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన తాజా చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ సినిమా రిలీజ్‌కి ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసి, థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఆ హైప్‌ను నిజం చేసింది. రిలీజ్ అయిన వెంటనే అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, హిందీ మార్కెట్‌లో కూడా మంచి స్థాయిలో దూసుకుపోతుంది.

అయితే రెండో వారం మొదలయ్యాక సాధారణంగా సినిమాల వసూళ్లు కొంచెం తగ్గడం సహజం. అలాగే కాంతార చాప్టర్ 1కి కూడా సోమవారం రోజున ఆ ప్రభావం కనిపించింది. ఆ రోజు ఈ చిత్రం హిందీ వెర్షన్‌తో మాత్రమే సుమారు 4.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ 150 కోట్ల మార్క్‌ను దాటేశాయి.

ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఈ స్పీడ్ కొనసాగితే కేవలం హిందీ వెర్షన్ ద్వారానే 200 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే కాంతార చాప్టర్ 1 హిందీ బాక్సాఫీస్‌పై కూడా సత్తా చాటుతోంది అని చెప్పొచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles