కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దేశీయంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు వెయ్యి కోట్ల మార్క్‌కి దగ్గరగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మరో కొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక భారతీయ సినిమా ఇంగ్లీష్ డబ్ వెర్షన్‌లో థియేటర్లకు రానుండటం ఇదే తొలిసారి కావడంతో సినిమా ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
సినిమా ఇంగ్లీష్ వెర్షన్ రన్‌టైమ్ 2 గంటల 14 నిమిషాలు 45 సెకన్లు ఉండబోతుందని టీమ్ ప్రకటించింది. అయితే ఈ వెర్షన్‌లో ఏమైనా సన్నివేశాలు మార్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
