కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ హైప్ క్రియేట్ చేసిన ‘కాంతార చాప్టర్ 1’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించాడు. రిలీజ్‌కు ముందే ట్రైలర్, టీజర్లతో మంచి బజ్ తీసుకొచ్చిన ఈ చిత్రం, ప్రీమియర్ షోస్‌లో వచ్చిన టాక్ వల్ల ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే వచ్చిన స్పందన చూస్తుంటే ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ విజయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. తన సోషల్ మీడియా ద్వారా రిషబ్ శెట్టి, హొంబలే ఫిల్మ్స్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. హీరోగా, దర్శకుడిగా రిషబ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడని, ఇలాంటి ప్రత్యేకమైన విజన్‌ను ముందుకు తెచ్చిన ప్రొడక్షన్ హౌస్‌కు అభినందనలు తెలిపాడు.
తెలుగు వెర్షన్ ప్రమోషన్లో కూడా ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.
