కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ “కాంతార చాప్టర్ 1” ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. విడుదలైన వెంటనే ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దుమ్మురేపుతోంది. మొదటి భాగం కంటే ఈసారి మరింత గ్రాండ్‌గా, విజువల్‌గా అద్భుతంగా ఉండటంతో అన్ని భాషల్లో మంచి స్పందన దక్కుతోంది.
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అసాధారణ రీతిలో వసూళ్లు సాధిస్తోంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 427 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించి 400 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అంటే రిషబ్ శెట్టి తన దర్శకత్వంతో మళ్లీ ఒక సెన్సేషన్ సృష్టించాడు అనడం తప్పు కాదు.
గతంలో వచ్చిన “కాంతార” లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను ఈ సీక్వెల్ కొన్ని రోజుల్లోనే అధిగమించడం విశేషం. హోంబళే ఫిలిమ్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.
