గ్రాండ్‌ విజువల్స్‌ తో ఆకట్టుకున్న కాంతార 1!

Wednesday, December 10, 2025

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా భారీ స్పందన తెచ్చుకుంది. కేవలం కన్నడలోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సక్సెస్ తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి అంతా దాని సీక్వెల్‌పై పడింది. కాంతార చాప్టర్ 1 పేరుతో వస్తున్న ఈ చిత్రానికి మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ట్రైలర్ ప్రారంభంలోనే భావోద్వేగం రేపే సన్నివేశంతో మొదలై, ఆ తర్వాత ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండ్ విజువల్స్, షార్ప్ షాట్స్, పక్కా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. కేవలం టెక్నికల్ పరంగా మాత్రమే కాకుండా, స్థానికతకు దగ్గరగా ఉన్న నేటివిటీ టచ్, భావోద్వేగం కూడా బలంగా కనిపించాయి. దాదాపు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్‌లో ఉత్కంఠను రేపే షాట్లు వరుసగా కనిపించాయి.

ముఖ్యంగా మేకింగ్ స్టైల్, కంటెంట్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles