అదిరిపోయే లెవల్లో “కన్నప్ప” టీజర్ లాంఛ్ ఈవెంట్!

Monday, July 8, 2024

యంగ్‌  హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతో వైరల్‌ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఓ వార్త ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రానికి  సంబందించిన టీజర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంఛ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇదే విషయాన్ని చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

మే 20, 2024 న సాయంత్రం 6:00 గంటలకి ఈ ఈవెంట్ జరగనుంది. రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. విష్ణు పోస్టర్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప గ్లింప్స్ గా రిలీజ్ కానున్న ఈ వీడియో గురించి  అందరిలో ఆసక్తి నెలకొంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ టీజర్ లో వీరి రోల్స్ ,  లుక్స్ రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles