కన్నప్ప పని మొదలు పెట్టిన యంగ్‌ రెబల్‌ స్టార్‌!

Sunday, December 22, 2024

టాలీవుడ్ యంగ్‌ హీరో మంచు విష్ణు చాలా కాలం తరువాత  సరికొత్త కథతో రాబోతున్నాడు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు.  గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా సెట్ లోకి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రముఖ పాత్రలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.. శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.. ఈ సినిమాలో కేవలం పది నిమిషాలు మాత్రమే డార్లింగ్ కనిపిస్తాడని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా డార్లింగ్ సెట్ లోకి అడుగుపెట్టాడు.. ఈ విషయాన్ని మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.. ఒక పోస్టర్ ను వదిలాడు.. ఆ ట్వీట్ లో మై బ్రదర్ ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అని రాసుకొచ్చాడు..ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  త్వరలోనే టీజర్ రాబోతుందని తెలుస్తుంది..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles