కన్నప్ప షూటింగ్‌ పూర్తి చేసుకున్న బాలీవుడ్ హీరో!

Thursday, December 26, 2024

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు కన్నప్ప కోసం అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు రంగంలోకి దిగారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శరత్‌ కుమార్‌, ప్రభాస్‌, బ్రహ్మనందం లాంటి పెద్ద పెద్ద తారలు అందరూ ఈ సినిమాలో నటించనున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు.

ఈ విషయం గురించి  విష్ణు మంచు స్వయంగా తన  సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. మహాశివరాత్రి రోజున విడుదలైన కన్నప్ప ఫస్ట్‌లుక్‌ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో అప్డేట్‌ తో కన్నప్పపై అంచనాలు పెరుగుతున్నాయి. చాలా మంది పాన్-ఇండియన్ స్టార్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ కనప్ప షూటింగ్ లో పాల్గొన్నారు.

తాజాగా అక్షయ్ కుమార్ తన షూటింగ్‌ పార్ట్‌ ను పూర్తి చేశారు. ఈ అంశంపై విష్ణు మంచు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్‌ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని., ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని విష్ణు తెలియజేశాడు. ప్రయాణం విలువైనది., మళ్లీ మళ్లీ ఇలాగే కలవాలని ఉందని తెలిపాడుకన్నప్ప మీకు సినిమాటిక్ అనుభూతిని అందించే విజువల్ వండర్ అవుతుందని., ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా అచంచల విశ్వాసం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని., ఇందులో తాను అంకితభావంతో పాత్రను చేసినట్లు తెలిపాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles