కంగువా’ తెలుగు ప్రమోషన్స్‌కు ముహుర్తం ఖరారు!

Sunday, December 22, 2024

తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘కంగువా’పై భారీ అంచనాలు  క్రియేట్ అయ్యాయి.డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ ఫాంటెసీ యాక్షన్ సినిమాలో సూర్య సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురూ చూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయనున్నారు. దీనికోసం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇప్పటికే నార్త్‌లో ప్రమోషన్స్ చేసిన సూర్య అండ్ టీమ్, ఇప్పుడు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయబోతున్నారు. ‘కంగువా’ చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ముచ్చటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్దమయ్యింది.

ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles