“కంగువా” కి పెద్ద ప్రమాదమే…తప్పించుకోవడానికి వీలు లేదుగా!

Sunday, December 22, 2024

రాబోయే రోజుల్లో పాన్‌ ఇండియా లెవల్లో భారీ చిత్రాలు కొన్ని పాన్‌ ఇండియా నుంచి పాన్‌ వరల్డ్‌ లెవల్లో పలకరిస్తున్నాయి. ఈ దసరా కానుకగా కొన్ని సినిమాలు ఆల్రెడీ స్లాట్ బుక్‌ చేసుకుంటున్నాయి. మరి ఈ సినిమాల్లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్‌ సినిమా కంగువా. ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కాబోతున్నట్లు డేట్‌ ఫిక్స్‌ చేశారు.

అయితే ఈ సినిమాకి మొన్నటి వరకు ఎలాంటి పోటీ లేదు కానీ తాజాగా ఒక రోజు గ్యాప్ తో అయితే ఓ భారీ సినిమా ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. కన్నడ నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ “మార్టిన్” ధృవ్ సార్జా నటించిన ఈ  సినిమా సెన్సేషనల్ ట్రైలర్ తో తాజాగా అనౌన్స్ అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 11న విడుదల అంటూ ఫిక్స్ కాగా ఇప్పుడు ఈ సినిమా మూలాన మాత్రం కంగువా కి పెద్ద పోటీనే పడేలా ఉందని సమాచారం. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పలు భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. కంగువా ని కూడా ఇలానే ప్లాన్ చేశారు. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ అక్టోబర్ లో భారీ క్లాష్ పడబోతుంది అని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles