ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన కంగువా..ట్రైలర్‌!

Thursday, September 19, 2024

తమిళ స్టార్‌ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న లేటేస్ట్‌ మూవీ కంగువా… పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాగా రానున్న ఈ మూవీకి శివ డైరెక్షన్‌ వహిస్తున్న సంగతి తెలసిందే. ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌ విశేషంగా అలరించింది.  ఈ సినిమాను రూ. 350 కోట్ల బడ్జెట్ తో  రూపొందించారు. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. తాజాగా కంగువ తమిళ్ ట్రైలర్ ను మూవీ మేకర్స్  విడుదల చేశారు. ఓపెనింగ్ షార్ట్ లో కథను వివరిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ అద్భుతమైన లొకేషన్స్ ను చూపిస్తూ కథలోకి ఎంట్రీ ఇచ్చాడు.

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ లుక్స్, నటన సూపర్ అనే చెప్పుకోవాలి. ఇక కంగువా పాత్రలో సూర్య ఆదరగొట్టాడు. ప్రతి సీన్, ప్రతి షాట్ క్వాలిటీ లో ఎక్కడ కంప్రమైస్ అవ్వకుండా తెరకెక్కించాడు దర్శకుడు శివ. ఇక చివరలో మొసలితో నీటిలో సూర్య వచ్చే షాట్ ట్రైలర్ కె హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్ళింది. చివరలో సూర్య తమ్ముడు కార్తీ గుర్రం మీద వస్తున్నట్లు చూపించాడు. మరి ఆ క్యారక్టర్ కార్తీనా లేక వేరెవరైనా అనేది సినిమా విడుదల అయితే కానీ తెలియదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles