యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారీ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’ రేపు థియేటర్లలోకి రానుంది. త్రిష, అభిరామి వంటి టాలెంటెడ్ నటీమణులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనుండగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ ఈ సినిమాకి మరో స్థాయిలో హైప్ తీసుకొచ్చింది. అయితే రిలీజ్ సమయం దగ్గరపడుతుండగానే ఈ సినిమాపై కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
ప్రత్యేకంగా కన్నడ వెర్షన్ విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కమల్ హాసన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కడి ఆడియెన్స్ ను బాధపెట్టాయి. దాంతో సినిమాని కన్నడలో విడుదల చేయవద్దని వాదనలు వెళ్లివచ్చాయి. ఫలితంగా ఆ స్టేట్‌లో థగ్ లైఫ్ రిలీజ్ నిలిచిపోయింది. ఈ నిర్ణయం వల్ల సినిమా మేకర్స్ కు దాదాపు పదిహేను కోట్ల వరకు నష్టం జరిగిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సినిమా తర్వాత అక్కడ విడుదల చేస్తామన్న చర్చలు వినిపించినా, ప్రస్తుత వాతావరణాన్ని చూస్తే అక్కడ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. దాంతో ఆ ప్రాంతంలో ఈ సినిమా థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ప్రొడక్షన్ బాధ్యతలు కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ కలిసి చేపట్టారు. భారీ బడ్జెట్ తో, టెక్నికల్ గా రిచ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఎలా రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అన్ని హైప్‌లు, కాంట్రవర్సీలు మధ్య థగ్ లైఫ్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు నెరవేర్చగలదో ఆసక్తిగా మారింది.
