యూనివర్సల్ హీరోగా పేరొందిన కమల్ హాసన్ రీసెంట్‌గా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన థగ్ లైఫ్ సినిమాతో తెరపైకి వచ్చారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి గొప్ప నటుడికి ఆస్కార్ అకాడమీ నుంచి సభ్యత్వ ఆహ్వానం రావడం అభినందనీయం.
ఈ విషయం తెలిసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తూ కమల్ హాసన్‌కు అభినందనలు తెలియజేశారు. పవన్ చెప్పిన విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన కమల్ హాసన్ కూడా పవన్‌కి బ్రదర్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ చెప్పిన మాటలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయని, ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇద్దరి మధ్య జరిగిన ఈ మాటల మార్పిడి అభిమానుల్లో సంతోషాన్ని పెంచగా, సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కమల్ – పవన్ మధ్య కనిపించిన పరస్పర గౌరవం సినీప్రపంచంలో అందరికీ అందమైన ఉదాహరణగా నిలుస్తోంది.
