ఆమె చేస్తేనే నేను యాక్ట్‌ చేస్తా!

Saturday, April 12, 2025

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ“అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో యాంకర్‌ సుమ.. చిత్రబృందంతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ పలు విషయాలను పంచుకున్నారు. విజయశాంతి నటించకపోతే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా చేయనని దర్శకుడికి గట్టిగా చెప్పేశారంట. కథ బాగా నచ్చినా, తల్లిపాత్రకు విజయశాంతి మాత్రమే కళ్యాణ్ రామ్ మదిలో మెదిలారట.

అందుకే, విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేస్తానని, లేకపోతే ప్రాజెక్టు పక్కనపెడదామని కళ్యాణ్ రామ్ క్లియర్ గా చెప్పేశాడట. ఆ తర్వాత ఈ కథను విజయశాంతి ఒప్పుకోవడంతో సినిమా పట్టాలపైకి వచ్చింది. కాగా ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles