450 మందితో కల్యాణ్‌ రామ్‌ భారీ ఫైట్‌!

Wednesday, September 18, 2024

నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ గా #NKR21 రూపుదిద్దుకుంటుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిసున్నారు. ఇక ఈ క్రమంలో సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం టీమ్ హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తోంది. ఇది 15 రోజుల పాటు కొనసాగుతుందని అంటున్నారు. 150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు షూట్‌లో పాల్గొంటున్న ఈ యాక్షన్ బ్లాక్‌ను ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఫైట్  సినిమాకు చాలా హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ వర్కింగ్ స్టీల్‌లో పీటర్ హెయిన్ మాస్టర్ సలహాలు ఇస్తూ కనిపించారు. ఈ సినిమాలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles