కల్యాణ్ బాబాయ్‌ స్పెషల్‌ థ్యాంక్స్‌:బన్నీ!

Saturday, January 18, 2025

పుష్ప–2 సక్సెస్ మీట్‌లో బన్నీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమేనని చెప్పారు. ఈరోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఆ  ఒక్కడికే చెందుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ సుకుమార్ వల్లే వచ్చాయి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నా మీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం.

ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్.. తంతే అక్కడ కూర్చోబెట్టావ్. దీనికి నేను ఏమి ఇవ్వగలను అంటూ బన్నీ ఎమోషనల్‌ అయ్యాడు. తరువాత తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు రేట్లు పెంచుకోనిచ్చిన ముఖ్యమంత్రులకు కృతజ్ఙతలు తెలిపాడు. నేను తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఙతలు చెబుతున్నాను. మా సినిమాకి స్పెషల్ హైక్ ఇచ్చినందుకు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి సపోర్టు కూడా చాలా అద్భుతంగా ఉంది చెప్పుకొచ్చాడు.

తెలంగాణలో ఎంత రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అంతే పెంచుకునే అవకాశం ఇచ్చారు. దీనికి ఏపీ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆయనకు ఎప్పటినుంచో సినీ పరిశ్రమ మీద మీ ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఈ స్పెషల్ జీవో పాస్ అయ్యి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పుకుంటున్నాను.అలాగే పర్సనల్ గా కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ అంటూ బన్నీ స్పెషల్ గా చెప్పాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles