నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఏ రేంజ్ హైప్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ వేరు కావడంతో సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్‌పై ఫ్యాన్స్ కళ్లేసి చూస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది. కల్కి 2898 ఎడి సినిమాలో కనిపించిన ఓ ప్రముఖ నటుడు ఇప్పుడు అఖండ 2లో కీలక పాత్ర చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఆ నటుడు ఎవరు అనే దానిపై ప్రేక్షకుల్లో భారీగా క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ వార్తల ప్రకారం, శాశ్వత చటర్జీ అనే బెంగాలీ యాక్టర్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక బాలయ్య ఈ సినిమాలో మరోసారి డబుల్ రోల్‌లో దర్శనమివ్వబోతున్నట్టు సమాచారం. అఖండ తరహాలోనే మాస్ మరియు ఇంటెన్స్ లుక్‌లలో ఆయన కనిపిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌ను థమన్ భుజాలపై వేసుకున్నారు. థమన్ మ్యూజిక్‌కి అఖండలో ఎంత స్థాయి రెస్పాన్స్ వచ్చిందో తెలుసు కాబట్టి ఈ సారి కూడా అతడి మ్యూజిక్ మీదే ఒక ప్రత్యేకమైన అంచనాలున్నాయి.
ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇప్పుడు శాశ్వత చటర్జీ లాంటి నాణ్యమైన నటుడు కూడా జాయిన్ కావడంతో ఈ సినిమా మీద హైప్ మరింత పెరిగింది.
