రెండు భాగాలుగా రానున్న కల్కి!

Wednesday, January 22, 2025

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న పాన్‌ వరల్డ్‌ సినిమా కల్ఇక 2898 ఏడీ . ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన  బాలీవుడ్‌ భామలు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాను చిత్ర బృందం జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.  ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేయగా అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను మరో అద్భుత లోకానికి తీసుకుని వెళ్లునున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ ట్రైలర్ తోనే సినిమాపై భారీగా అంచనాలు పెంచాడు. అయితే ఇప్పుడు వస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే కల్కి కూడా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ స్పందించేందుకు ఇష్టపడటం లేదు. అయితే ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది అనే టాక్‌ మాత్రం బాగా వైరల్ అవుతుంది. మరి కల్కి క్లైమాక్స్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహించని ట్విస్ట్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles