పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్, దిశా పటాని ఫీమేల్ లీడ్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ హిట్ మూవీ “కల్కి 2898 ఎడి”. ఎన్నో అంచనాలు ఏర్పరుచుకున్న ఈ మూవీ రికార్డు వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా దగ్గర మరో 1000 కోట్ల సినిమాగా జెండా ఎగరేసింది.
ఇక థియేటర్స్ తర్వాత ఓటిటిలో వచ్చి సాలిడ్ రెస్పాన్స్ ని అందుకోగా ఈ తర్వాత ఫైనల్ గా బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. తెలుగులో కల్కి హక్కులు జీ తెలుగు సొంతం చేసుకోగా మొన్ననే క్రేజీ ప్రోమో కట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేశారు. ఇక ఈ మూవీ ఫైనల్ గా డేట్ అలాగే సమయాన్ని కూడా ఖరారు చేసుకుంది.
దీంతో ఈ జనవరి 12న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి కల్కి టెలికాస్ట్ అవ్వబోతుంది. మరి బుల్లితెరపై కల్కి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో వేచిచూడాలి.