కాంత సినిమాలో అందాల ముద్దుగుమ్మ పోస్టర్ రిలీజ్‌!

Wednesday, March 26, 2025

హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కాంత’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ మూవీగా ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అందాల భామ భాగ్యశ్రీ బొర్సే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా ‘కాంత’ మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె క్యూట్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ‘చరిత్రపుటల్లో ఆమె ప్రేమకథ ఇంకా ప్రతిధ్వనిస్తుంది’ అంటూ వారు ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే చేయబోయే పాత్రపై మేకర్స్ ఆసక్తిని క్రియేట్ చేశారు.

ఈ సినిమాను 1950 కాలం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా.. ఝాను ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles