గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, డైరెక్టర్ శంకర్ కాంబోలో చేసినమోస్ట్ అవైటెడ్ సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి చరణ్ హిట్ కొట్టడంతో పాటు శంకర్ మాస్ కం బ్యాక్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ అంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుండగా ఈ సంక్రాంతికి అభిమానుల ముందుకు వచ్చేస్తుంది.
అయితే ఈ సినిమా విడుదలకి ఒక్క తమిళ్ లో తప్ప ఇంకెక్కడా పెద్దగా పోటీ లేని సంగతి తెలిసిందే. తమిళ్ నుంచి అజిత్ నటించిన అవైటెడ్ మూవీస్ గుడ్ బ్యాడ్ అగ్లీ అలాగే విడా ముయర్చి సినిమాలు రావాల్సి ఉండగా ఒకటి వాయిదా, మరోకటి తర్వాత రావాల్సి ఉన్నాయి. కానీ ఫైనల్ గా రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో తప్పుకోవడంతో ఫైనల్ గా గేమ్ ఛేంజర్ కి తమిళనాట భారీ పోటీ తప్పిందనే చెప్పుకోవచ్చు.
దీంతో తమిళ్ వెర్షన్ లో గేమ్ ఛేంజర్ కి జస్ట్ టాక్ ఒకటి కరెక్ట్ గా పడితే మిగతాది శంకర్, చరణ్ లు చూసుకుంటారని ఈజీగా చెప్పేయోచ్చు. మరి ఈ చిత్రానికి జస్ట్ ఒక పాజిటివ్ టాక్ తమిళ్ లో పడాల్సి ఉంది అంతే.