నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని రీచ్ అయ్యే సెన్సేషనల్ వసూళ్లు కూడా రాబడుతుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో కూడా హిట్ 3 అదరగొడుతుంది.
మరి యూఎస్ మార్కెట్ లో అప్పుడే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ గ్రాస్ క్లబ్ లో చేరి మరో రికార్డు సృష్టించింది. కేవలం ఇది డే 1 జరిగిపోయింది. 1 మిలియన్ మార్క్ ని ఖాతాలో వేసుకుంది. ఇలా మొత్తానికి హిట్ 3 మేనియా యూఎస్ మార్కెట్ లో విధ్వంసం సెట్ చేసేలా ఉందని చెప్పొచ్చు.
