పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఎంటర్టైనర్ “ది రాజా సాబ్”పై ప్రేక్షకుల్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ లాంటి గ్లామరస్ హీరోయిన్‌లు ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.
అయితే తమిళ్ వెర్షన్ మాత్రం ఒక రోజు లేట్ గా అంటే జనవరి 10న విడుదల కానుంది. దానికి కారణం అదే రోజున కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన “జననాయకన్” రిలీజ్ అవ్వడం. దీంతో రెండు పెద్ద సినిమాలు క్లాష్ కాకుండా ఉండేందుకు “ది రాజా సాబ్” తమిళ్ రిలీజ్ ను ఒక రోజు వెనక్కి జరిపారు.
కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయ్ సినిమా తెలుగులో “జన నాయకుడు” పేరుతో జనవరి 9నే రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఇలాంటి పరిస్థితిలో “జన నాయకుడు” కూడా ఒక రోజు వెనక్కి వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చగా మారింది.
