కేవలం ముగింపేనా!

Sunday, December 22, 2024

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర విజయాన్ని సూపర్‌ గా ఎంజాయ్‌ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చూస్తూ దూసుకెళ్తున్న ‘దేవర’లో ఎన్టీఆర్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను థియేటర్లకు పరుగు పెట్టేలా చేస్తున్నాడు.  ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్‌తో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్ సీక్వెల్ మూవీ ‘వార్-2’లో ఎన్టీఆర్ కూడా యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ను కలిసి బిగ్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో ‘వార్-2’ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అయితే, ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, నెక్స్ట్ షెడ్యూల్‌కి సిద్దమవుతుంది. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేయబోతున్నట్లుగా సమాచారం.

ఇక ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుందంట. నవంబర్‌లో ఈ క్లైమాక్స్ షూట్ చేయనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles