పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు పెద్ద సినిమాలపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. వాటిలో ఒకటి ‘ఓజి’, మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ రెండు చిత్రాలు ఆయన అభిమాన దర్శకులే తెరకెక్కిస్తుండటంతో మొదటి నుంచే క్రేజ్ పెరిగింది.
ఇటీవల ఈ రెండు సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు బయటకొచ్చాయి. ‘ఓజి’ విషయంలో పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన మొత్తం డబ్బింగ్ పనిని ముగించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ మాత్రం పవన్ షూటింగ్ పూర్తయిందని చెబుతూ, పవర్ఫుల్ సెండాఫ్ వీడియోను విడుదల చేసింది.
ఈ రెండు అప్డేట్లు ఒకేసారి రావడంతో పవన్ అభిమానులు డబుల్ ఫెస్టివల్ మూడ్‌లో మునిగిపోయారు. విడుదల విషయానికొస్తే, ‘ఓజి’ని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను మాత్రం వచ్చే సంవత్సరం థియేటర్లలో విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
