ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీగా VD12 నిలిచింది. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌ని రూల్ చేయడం ఖాయమని అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు.. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్‌తో సాలిడ్ అప్డేట్‌ను ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
VD12 టైటిల్ టీజర్‌ను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ టైటిల్ టీజర్‌కు వివిధ భాషల్లో వివిధ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ టీజర్‌కు సూర్య, హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక తాజాగా తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ‘దేవర’ సిద్ధమయ్యాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ఈ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్‌తో హీరో విజయ్ దేవరకొండ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దేవరకొండ కోసం దేవర వచ్చాడంటూ అభిమానులు ఈ ఫోటోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.