సహా నటిని రహస్యంగా పెళ్లాడిన జర్నీ హీరో!

Friday, December 27, 2024

తమిళ యంగ్‌ హీరో జై గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జర్నీ, రాజా రాణి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జర్నీ సినిమాలో నటించిన మన తెలుగు నటి అంజలితో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న సమయంలో ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా జై తన సహానటి ప్రగ్యా నగారాతో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసుకుని ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ గా మారాడు. ప్రగ్యా నగారా కూడా తమిళ్ లో కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించింది. తాజాగా ఆమె మెడలో మంగళసూత్రం ధరించి ఉండగా పక్కనే ఆమెకు దగ్గరగా నటుడు జై  కూర్చుని చేతిలో రెండు పాస్పోర్ట్ లు, ఫ్లైట్ టికెట్స్ తో ఫోటోకు ఫోజు ఇచ్చాడు. దేవుడి దయతో కొత్త జీవితం స్టార్ట్ అయింది అంటూ ఇద్దరూ ఒకే ఫోటోని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకొని హనీమూన్ కి వెళుతున్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.

ఈఫోటోలను చూసిన చాలామంది వీరిద్దరికి కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే తమిళ సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి బేబీ అండ్ బేబీ అనే ఒక సినిమా చేస్తున్నారని ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా జై చేస్తుండగా హీరోయిన్‌ గా ప్రగ్యా చేస్తుంది. సత్యరాజ్, యోగి బాబు వంటి వాళ్ళు ఇద్దరు కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగించబోతున్నారని తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ ఒకేసారి  మొదలుపెట్టే కంటే ఇలా ఏదైనా వెరైటీగా  ప్లాన్ చేస్తే త్వరగా జనాల్లోకి వెళ్తుంది అనుకున్న చిత్ర బృందం ఈ ఫొటో విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వారే  చెబితే కానీ తెలియదు. అయితే వారిద్దరూ షేర్ చేసిన ఫోటో వెనుక మాత్రం మూవీ కెమెరా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాదాపుగా ఇది సినిమా ప్రమోషన్ అని ఫిక్స్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles