4 కోట్లు ఇస్తారా..అయితే ఆ పని చేసేందుకు రెడీ అంటున్న జాన్వీ!

Wednesday, January 22, 2025

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌డమ్ అందుకుంది. అంతే కాకుండా ఇప్పుడు తెలుగులోనూ తన నటనతో ఆకట్టుకోవడానికి అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో హీరో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో, బుచ్చి బాబు దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ సరసన ఓ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది జాన్వీ కపూర్. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా మావ అనే ఐటెం సాంగ్ ఎంత పాపులారిటీ అయ్యిందో తెలిసిన విషయమే.  ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వేన్స్‌గా వస్తున్న పుష్ప 2 మూవీలో కూడా ఐటెం సాంగ్ అదే రేంజ్‌లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడంట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నాడంట దేవిశ్రీ .

అయితే ఈ ఐటెం సాంగ్‌లో స్టార్ బ్యూటీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు లెక్కల మాస్టర్. ఇప్పటికే దిశా పటానీ, త్రిప్తి డిమ్రి పేర్లు వినిపించగా.. జాన్వీ కూడా ఆ రేసులో చేరింది. ఇప్పటికే జాన్వీని పుష్ప 2 మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది.అయితే జాన్వీ ఈ పాట కోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఇక ఒక్క పాట కోసం 4 కోట్లంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే జాన్వీ డిమాండ్‌తో మేకర్స్ ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles