మరో స్టార్‌ హీరో పక్కన నటించేందుకు రెడీ అంటున్న జాన్వీ!

Sunday, December 22, 2024

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌. తెలుగులో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ పక్కన దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే.. ఈ భామ టాలీవుడ్‌ లో ఫుల్‌ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. ఎందుకంటే తెలుగులో తన రెండో చిత్రాన్ని రామ్ చరణ్‌ పక్కన కన్ఫార్మ్‌ చేసేసుకుని ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేసింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో స్టార్ హీరో సరసన నటించబోతున్న టాక్‌ వినిపిస్తుంది. ఈ స్టార్ నటుడు మరెవరో కాదు.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. మహేష్‌ బాబు తాజాగా రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా భారీ అడ్వెంచర్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

 ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా  జాన్వీ కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే జాన్వీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానం సంపాదించుకోవాలని, బోనికపూర్ తన పలుకుబడిని ఉపయోగించి జాన్వీ పేరుని చెప్పినట్లు సమాచారం.
దీంతో రాజమౌళి తన సినిమాలో జాన్వీని ఒకే చేసినట్లు తెలుస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles