బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జాట్’ టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండటమే దీనికి కారణం అని చెప్పాలి. ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేసేందుకు సిద్ధమవుతుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నేడు(మార్చి 22న) గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
కానీ, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు.. ప్రేక్షకులు దీనికి ఏమాత్రం నిరాశకు లోనవద్దని.. వారి ఎదురుచూపులకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ ఫీస్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతుంది.
ఇక ఈ సినిమాలో రణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్ర, సయామీ ఖేర్ ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మాస్ బీట్స్ అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.